Thursday, 15 July 2021

ఆ డబ్బులేం చేశారు.. ‘మా’ వాళ్లకి బాలయ్య దబిడిదిబిడి వాయింపు.. కీలక వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు నందమూరి . మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) లోకల్ , నాన్‌ లోకల్ అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోనన్న .. తనదైన శైలిలో అందర్నీ ఏకిపారేశారు. ఇంతవరకూ మా బిల్డింగ్ ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ అనేది గ్లామర్‌ పరిశ్రమ... మన సమస్యల్ని బహిరంగంగా చర్చించకూడదు.. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్న సినీ పెద్దలు మా బిల్డింగ్ కోసం ఓ ఎకరం భూమిని కూడా సాధించలేకపోయారా?? ఫండ్ రైజింగ్ అంటూ ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన మా సభ్యులు ఆ డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు బాలయ్య. ఈ సందర్బంలో మా ప్రెసిడెంట్‌ పోటీలో ఉన్న మంచు విష్ణు.. మా బిల్డింగ్ నిర్మిస్తారనే విషయాన్ని ప్రస్తావించగా.. ఆ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని బాలయ్య చెప్పారు. ఇండస్ట్రీ పెద్దలంతా బిల్డింగ్ కోసం పాటుపడాలని పిలుపునిచ్చిన బాలయ్య.. అందరం కలిస్తే ‘మా’ కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని సూచించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3klv8uH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...