మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి సాధారణ ఎన్నికలను తలపించేలా జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో ప్రకాశ్‌రాజ్, , జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. మరికొందరు కూడా బరిలో దిగి అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల కోసం మూడు నెలల ముందుగానే అభ్యర్థుల హడావిడి మొదలైంది. ఎవరి నినాదంతో వాళ్లు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇంత మంది మధ్యలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని.. అందుకే ఎన్నికలు ఏకగ్రీవం చేయాలంటే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రచారం మాత్రం ప్రతీ ఒక్కరు వేగవంతం చేశారు. ఎవరి స్టైల్‌లో వాళ్లు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ నిర్వహించి తన బలాబలాలు ఏంటో చూపిస్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా మంచు విష్ణు ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రకాష్ రాజ్‌పై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నిర్మాతలు అనే వాళ్లు మన ఇండస్ట్రీకి మూల స్తంభం లాంటి వాళ్లు. అసలు డబ్బు పెట్టే నిర్మాత అనేవాడు లేకపోతే.. మన ఇండస్ట్రీనే ఉండదు. అలాంటి నిర్మాతలకు ఒక నటులుగా మనం ఎంతో సహకారం అందించాలి. వాళ్లకి మనకి మధ్య మంచి సంబంధం ఉండాలి. వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు. అంతేకానీ, నేను నటుడిని నేను నా ఇష్టమొచ్చినట్లుగా చేస్తా.. అంటే కరెక్ట్ కాదు కదా. ఫైటర్లు, డ్యాన్సర్లు ఇతర యూనియన్ల మధ్యలో ఉన్న ఐకమత్యం మన ఆర్టస్టుల్లో ఎందుకు ఉండదు’ అంటూ ప్రకాష్ రాజ్‌ని ఉద్దేశిస్తూ మంచు విష్ణు కామెంట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xW280t
v
No comments:
Post a Comment