Sunday, 18 July 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: అను డబుల్ ధమాక.. సమంత నవ్వులు.. రాయ్ లక్ష్మి మెరుపులు

అను డబుల్ ధమాక.. ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ . ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీ అయిపోయింది. కెరీర్‌లో పెద్దగా హిట్స్ లేకపోయినా.. క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. ఇక సోషల్‌మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మిర్రర్ ఇమేజ్‌ స్టైల్‌లో ఓ పిక్ పోస్ట్ చేసి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది అను. హీరోయిన్‌ని నవ్వించడానికి అక్షయ్ తిప్పలు బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఆదివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సహ నటీనటులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ ఖిలాడీ కూడా తనదైన స్టైల్‌లో భూమికి విషెస్ తెలిపారు. ‘బర్త్‌డే గర్ల్‌ని నవ్వించడానికి ఎంతో ట్రై చేస్తున్నాను. కానీ, తను మరో సంవత్సరం పెరిగిందని తెలిసి ఆమె తెలుసుకుంది. బాధపడకు భూమి వయస్సుతో పాటు నీకు తెలివి కూడా పెరుగుతుందిలే’ అంటూ అక్షయ్ పోస్ట్ చేశారు. నవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ క్వీన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే సూపర్‌హిట్ అందుకున్న ఆమె కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది ఈ భామ. ఇక సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది శామ్. తాజాగా పింక్ రంగు దుస్తులు ధరించి.. నవ్వులు చిందిస్తూ ఓ ఫోటో పెట్టింది ఈ ముద్దుగుమ్మ. శ్వేతవర్ణం చీరలో అదరహో హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్యే తన నిశ్చితార్థం బ్రేక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య భిష్ణోయ్‌ని నిశ్చితార్థం చేసుకున్న ఆమె.. పలు వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని బ్రేక్ చేసుకున్నారు. అయితే తాజాగా మెహ్రీన్ తన ఓ పెళ్లి వేడుకలో తళుకుమంది. అందుకు సంబంధించిన పిక్స్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. శ్వేతవర్ణం చీరలో మెహ్రీన్ అందాలు చూస్తే ఎవరైనా అదరహో అనాల్సిందే. తళతళలాడే చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ రాయ్ లక్ష్మి హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్. సోషల్‌మీడియాలో తరచూ అందాల ఆరబోస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఓసారి బికినీ ధరించి పిక్స్ పోస్ట్ చేస్తే.. మరోసారి సాంప్రదాయ వస్త్రాలతో దర్శనమిస్తుంది. తాజాగా తళతళలాడే చీరలో మెరిసిపోతూ కొన్ని వీడియోని ఆమె షేర్ చేసింది. ‘మనం మెరిసేవరకూ జీవితం మెరవదు’ అంటూ దీనికి ఆమె క్యాప్షన్ పెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3z5bbMK
v

No comments:

Post a Comment