Friday, 9 July 2021

శ్రియాను మోసం చేసిన భర్త.. చివరకు షాకిచ్చిన హీరోయిన్

హీరోయిన్ శ్రియా, ఆమె భర్త సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి సరసాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. మొన్నీమధ్యే ఆండ్రూ షేర్ చేసిన వీడియోను చూసి అందరూ షాక్ అయ్యారు. బోట్ ప్రయాణం చేస్తున్న ఈ ఇద్దరూ సరసాలు ఆడుకున్నారు. ఏకంగా ఎద భాగాన్ని ఆండ్రూ కొరికే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా ఈ ఇద్దరూ తమ సరసాలు సోషల్ మీడియాలో బహిరంగంగానే షేర్ చేస్తుంటారు. ఇక ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని వారిని ఫాలో అయ్యే నెటిజన్లకు ఇట్టే తెలిసిపోతోంటోంది. తాజాగా ఆండ్రూ తన పనిలో నిమగ్నమై ఉన్నారు. నన్ను పట్టించుకోవా? నేనంటే ఇష్టం లేదా? నన్ను ప్రేమించడం లేదా? అని శ్రియా కవ్వించే ప్రయత్నం చేశారు. అలా పనిలోనే ఉన్న ఆండ్రూ గాల్లోనే ముద్దులిచ్చారు. అలా శ్రియా, ఆండ్రూలు చేసే సందడి నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ ఇద్దరి మరో వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తన భార్య శ్రియాను ఆండ్రూ మోసం చేశారు. మ్యాజిక్ చేస్తానంటూ విరిగిపోయిన క్రెడిట్ కార్డులను అతకబెట్టేశారు. కళ్లు మూసుకో అని శ్రియాకు చెప్పి అబ్రకదబ్ర అనమన్నారు. అలా శ్రియా కళ్లు మూసుకున్న సమయంలో మరొకొత్త క్రెడిట్ కార్డును అందులో పెట్టారు. అలా శ్రియాను మోసం చేసిన ఆండ్రూకు చివర్లో షాక్ తగిలింది. అలా పెట్టిన కొత్త క్రెడిట్ కార్డును శ్రియానే ఉంచేసుకున్నారు. ఇక చివర్లో భర్తకు ప్రేమతో శ్రియ పెట్టిన ముద్దు కూడా వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qWhBLv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...