Wednesday, 7 July 2021

ఆయనతో కలిసి దీపికా పదుకొనే రచ్చ.. నాకు ఫీలింగ్స్ ఉండవా అంటూ భర్త కోసం ఆ వీడియో!!

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో అత్యంత క్రేజీ హీరో ఎవరంటే మొదటగా వినిపించేది పేరే. కెరీర్‌లోనే కాదు బయట కూడా అతను ఎంతో క్రేజీగా ఉంటూ.. అభిమానులను ఆకట్టుకుంటాడు. సినిమాల్లోకి వచ్చాక తొలుత హేమా మాలిని చిన్న కూతురు అహానాతో మొదట డేటింగ్‌ చేసిన ఇతను.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో ప్రేమలో పడి.. 2018లో ఆమెని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి దీప్‌వీర్‌గా ఈ జంట అనుబంధం కొనసాగుతోంది. ఇక దీపికా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటించి అక్కడా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రణ్‌వీర్, దీపికాలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో వాళ్లు తరచూ టచ్‌లోనే ఉంటారు. తమకు సంబంధించిన సమాచారాన్ని అభిమానులకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటారు. రకరకాల దుస్తుల్లో ఫోటోషూట్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కి ఆకట్టుకుంటోంది ఈ జంట. మంగళవారం రణ్‌వీర్ తన 36వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అతనికి అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలిపారు. అయితే అందరిలా తెలిపితే.. అందులో దీపికా ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఆమె కాస్త వినూత్నంగా ఓ ఫన్నీ వీడియోతో రణ్‌వీర్‌కి విషెస్ తెలిపింది. ఆ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన.. ‘మేరేకో ఫీలింగ్స్ నహి హే’ అనే డైలాగ్ రీమిక్స్ సాంగ్‌కి ఆమె భర్తతో కలిసి వీడియో చేసింది. ‘నా ఫేవరేట్ పర్సన్ రణ్‌వీర్ సింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ దీనికి ఆమె క్యాప్షన్ ఇచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dR1iKw
v

No comments:

Post a Comment