Friday, 9 July 2021

దానిపై మనస్సు పారేసుకున్న ఆలియా భట్.. ఏ క్షణాలోనైనా జెండా ఎత్తేసే ఛాన్స్..!

బాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఉన్న హీరోయిన్ ఎవరంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు ఆలియా భట్. ‘ఆర్ఆర్ఆర్’, ‘గంగూబాయ్ కతియావాడి, ‘బ్రహ్మాస్త్ర’ తదితర పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది ఈ భామ. అంతేకాక.. ఈ మధ్య నిర్మాతగా కూడా తన అదృష్టం పరీక్షించుకొనేందుక రెడీ అవుతోంది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌తో కలిసి ఆమె.. ‘డార్లింగ్స్’ అనే సినిమాను రూపొందిస్తోంది. అయితే తాజాగా ఈ భామ ఓ విషయంపై మనస్సు పారేసుకుందట. ఈ విషయంలో తన సీనియర్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనేలను ఫాలో అవ్వాలని ఆలియా డిసైడ్ అయిందట. ఇందుకోసం ఇప్పటికే ఆమె అంతా సిద్ధం చేసి పెట్టుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది మరేదో కాదండీ.. . బాలీవుడ్ నుంచి ఇప్పుటికే చాలా మంది హీరోయిన్లు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించారు. అలాగే తన కూడా హాలీవుడ్‌లో పాపులర్ కావాలని ఆలియా భావిస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ప్రముఖ హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ డీఎంఈతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. ఈ మేరకు ఆమె తొలుత కొన్ని ప్రాజెక్టుల కోసం ఆడిషన్లు ఇచ్చి.. అందులో దర్శక నిర్మాతలను మెప్పించగలిగితే.. హాలీవుడ్‌లో సినిమాల్లో నటించే అవకాశం సాధించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ప్రస్తుత హీరోయిన్లలో దీపికా, ప్రియాంకల తర్వాత హాలీవుడ్ నటించిన హీరోయిన్‌గా ఆలియా భట్‌కు ఘనత దక్కే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ww00ee
v

No comments:

Post a Comment