రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఓ ఇంటిదైన బాలీవుడ్ నటి, మోడల్ యామీ గౌతమ్ ఇంతలోనే ఇబ్బందుల్లో చిక్కుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త జీవితం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా ఆమెకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెపై దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యామీ గౌతమ్‌కు షాకిచ్చింది. ఈ మేరకు జులై 7వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. యామి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో కోటిన్నర విదేశీ మారక లావాదేవీలు జరిగాయని, అయితే ఆమె దీని గురించి అధికారులకు తెలియజేయని కారణంగా ఈడీ అధికారులు సమన్లు చేశారని సమాచారం. పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన యామీ గౌతమ్.. 2009 సంవత్సరంలో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఏక్ నూర్' అనే పంజాబీ సినిమా చేసి 'నువ్విలా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాతి సంవత్సరంలో ఆమె చేసిన 'విక్కీ డోనర్' అనే హిందీ సినిమా నటిగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. తెలుగులో కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలో ఆమె చివరగా కనిపించిన యామీ గౌతమ్.. దర్శకుడు ఆదిత్య ధార్‌తో ప్రేమలో పడి అతన్నే పెళ్లాడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qILX3V
v
No comments:
Post a Comment