Sunday, 4 July 2021

సీనియర్ హీరోతో మహేష్ బాబు వార్! అంతా అలా అనుకున్నారు కానీ సీన్ రివర్స్

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గడంతో మెల్లగా షూటింగ్స్ మొదలవుతున్నాయి. అటకెక్కిన స్టార్ హీరోల సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హీరోగా రాబోతున్న '' సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ చేయబోతున్నారట. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో సీనియర్ నటుడు భాగం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన విలన్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ నటిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు- అర్జున్ మధ్య తీవ్రమైన వార్ నడుస్తుందని, ఈ సినిమాలో ఆ సీన్స్ బాగా హైలైట్ అవుతాయని అంటున్నారు. బ్యాకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో భారీ సినిమాగా 'సర్కారు వారి పాట'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. థమన్ బాణీలు కడుతున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/369ilDr
v

No comments:

Post a Comment