Wednesday, 14 July 2021

నిహారిక సిగరెట్ తాగుతుందా?.. మెగా డాటర్ మామూల్ది కాదు!

మెగా డాటర్ సెట్‌లో ఉంటే ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మొన్నీమధ్యే పాండిచ్చెరిలో కొత్త జంట కొట్టిన చక్కర్లు, అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పాండిచ్చెరిలో నిహారిక వేసిన డ్రెస్సులు, షేర్ చేసిన సెల్ఫీలు ఎంతగానో హల్చల్ చేశాయి. నిహారిక తన షూటింగ్‌లతో బిజీగా ఉంటోందన్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అంతకు ముందు కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతోన్నారు. అయితే వెండితెరకు మాత్రం నిహారిక దూరంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతోనే బిజీగా ఉన్నారు. వెబ్ సిరీస్‌లలో నటిస్తూ, నిర్మిస్తూ రచ్చ చేస్తున్నారు. ఆ మధ్య అనసూయతో కలిసి ఓ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఆమె భర్త చైతన్య కూడా తనతో పాటే ఉన్నారు. అలా భర్తతో కలిసి నిహారిక ఆ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ పనులు చకాచకా జరుగుతోన్నట్టు కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో నిహారిక మంచిపాత్రనే పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా నిహారిక ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఓ సిగరెట్ ప్యాకెట్‌ను చూపించారు. స్వీట్ సిగరెట్ అంటూ బాగుందనే ఎమోజీలను షేర్ చేశారు. మొత్తానికి షూటింగ్ కోసం ఆ స్వీట్ సిగరెట్‌లను నిహారిక తాగినట్టు కనిపిస్తోంది. ఏమైనా మెగా డాటర్ మాత్రం పెళ్లి తరువాత మంచి స్పీడు మీదున్నట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xK1J0Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...