Sunday, 18 July 2021

నితిన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ‘మాస్ట్రో’ కోసం తమన్నాతో స్పెషల్ సాంగ్

‘భీష్మ’ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న హీరో ఆ తర్వాత బోల్తాపడ్డాడు. ఈ ఏడాది విడుదలైన ‘చెక్’, ‘రంగ్‌దే’ సినిమాలో ఆయనకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. దీంతో నితిన్ మరోసారి హిట్ వేటలో పడ్డాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న సినిమా ‘’. హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘అంధాదున్’ సినిమాకు ఇది రీమేక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఇందుకోసం ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. నబా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తమన్నా ఆల్రెడీ సినిమాకు డబ్బింగ్ చెప్పడం కూడా ప్రారంభించింది. ఇప్పటికే వదిలన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తే.. తాజాగా విడుదలైన ‘బేబీ ఓ బేబీ’ అనే పాట సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో మరో అడుగు ముందుకు వేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందుకోసం ఓ సరికొత్త స్కెచ్‌ని రూపొందించింది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లోనే హీరో నితిన్, తమన్నాల మధ్య ఓ ప్రమోషనల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారట. మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్‌తో పాటు ఈ సాంగ్ షూటింగ్‌ కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తర్వాత సినిమా నుంచి మిగితా పాటలను.. ఆ తర్వాత టీజర్, ట్రైలర్‌లను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి, రాజ్‌కుమార్ అకెళ్లా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kwo0eU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...