Monday, 26 July 2021

వయసు పెరిగినా తీరు మారలే! లంగావోణీ అంటూ యాంకర్ సుమపై సీనియర్ నటి కామెంట్.. అంతా షాక్

తన మాటల తూటాలతో తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న బుల్లితెరపై హవా నడిపిస్తోంది. సుమ హోస్ట్‌గా చేసే ఏ ప్రోగ్రాం అయినా సరే సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవాల్సిందే అన్నట్లుగా ముద్ర వేసుకున్న ఆమె.. గత కొన్నేళ్లుగా 'క్యాష్' షోను ఒంటిచేత్తో నడిపిస్తోంది. టీవీ, సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళతో డబ్బుల ఆట ఆడిస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. అయితే ఎప్పుడూ ఇతరులపై పంచులేసే సుమకు తాజా షోలో సీనియర్ నటి పంచ్ విసరడం హైలైట్ అయింది. వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'క్యాష్' ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో సీనియర్ యాక్టర్స్ , రాజ్యలక్ష్మి, గౌతం రాజు, శివ పార్వతిల సందడి కనిపించింది. వాళ్లతో సరదా సంభాషణ సాగిస్తూనే పంచులేస్తూ కనిపంచింది యాంకర్ సుమ. అయితే నటి ఎంట్రీ ఇస్తూ ఇస్తూనే రివర్స్‌లో సుమపై అదిరిపోయే పంచ్ విసిరింది. 'నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. మేమెప్పుడో మా చిన్నప్పుడు ఇలా లంగావోణీలు వేశాము. కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ అవే వేస్తున్నావు' అని నేరుగా అనేయడంతో సుమ వెంటనే రియాక్ట్ అయింది. అంటే.. ఇందులో ఏమిటి మీ అర్థం? నాకు ఇంత పెద్ద వయసు వచ్చినా ఇంకా లంగావోణీలు వేసుకుంటున్నాననా? అంటూ రాజ్యలక్ష్మి వేసిన ఆ పంచ్‌ని సరదాగా స్వీకరించింది. దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ రాజుతో స్టెప్పేసి ఆకట్టుకుంది. అలాగే తన గ్లామర్ రహస్యం ఇలా వాగుతూ ఉండటమే అని చెప్పి అందరికీ షాకిచ్చింది సుమ. అలాగే బాబు మోహన్ చేసిన కామెడీ, పాత సినిమాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జులై 31వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kXxxfw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...