Thursday, 8 July 2021

వచ్చీ రావడంతోనే మొదలెట్టేశాడుగా.. ఇన్ స్టాగ్రాంలో కమెడియన్ ఆలీ మొదటి పోస్ట్ ఇదే

సెలెబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. చేతిలో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియాను వాడకుంటూ ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటారు. అయితే కొంత మంది సీనియర్స్ మాత్రం ఇంకా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వలేదు. కొందరు పాక్షికంగా ఉన్నారు. ఇంకొంద కొన్నింట్లో ఉన్నారు.. ఇంకొన్నింట్లో లేరు. ఇప్పుడు తాజాగా ఇన్ స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు మొదటి పోస్ట్ చేస్తూ సాలిడ్‌గా అడుగు పెట్టేశారు. ఇక చేసిన మొదటి పోస్ట్‌ బాగానే వైరల్ అవుతోంది. ఆలీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలంటే సోషల్ మీడియాను వాడుకోవాల్సిందే. ఇక ఆలీకి ఫేస్ బుక్ ఖాతా మాత్రమే ఉంది. అలీకి ట్విట్టర్ అకౌంట్ లేదు. ట్విట్టర్ ఫేక్ అకౌంట్ మూలాన ఆలీ ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. తన పేరిటి ఉన్న ట్విట్టర్ ఖాతాలపై ఆలీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఇన్ స్టాగ్రాంలోకి అడుగుపెట్టేశారు. వస్తూనే మొదటి పోస్ట్‌తో తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఆలీ హీరోగా అనే సినిమా రాబోతోంది. ఈ మూవీ గురించి ఆలీ బాగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆలీ సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా అలీ తన మొదటి పోస్ట్‌లో ఈ మూవీ గురించి ప్రస్థావించారు. ఈ చిత్రంలోని సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్‌ను షేర్ చేశారు. ఇది నా అధికారిక ఖాతా.. ఈ స్టిల్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలోని నా గుండె చిక్కుకుంది అనే పాటలోంది అని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xrr53P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...