Friday, 2 July 2021

సతీసమేతంగా యష్ నూతన గృహప్రవేశం.. కళ్ళు చెదిరే భవనం కోసం కేజీఎఫ్ స్టార్ ఎన్ని కోట్లు పెట్టారంటే!

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ కలల సౌధాన్ని ఎలా నిర్మించుకోవాలి, అందులో ఎలాంటి సదుపాయాలు ఉండాలి అనే దానిపై అంతా ఆలోచిస్తుంటారు. సమయం వచ్చినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి అడుగులేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ తాను నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి సతీసమేతంగా అడుగు పెట్టారు. నిన్న (గురువారం) యష్ గృహప్రవేశం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యష్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకొని గృహప్రవేశం చేశారు. ఖరీదైన వైట్ మార్బుల్, వుడ్ ఫర్నిష్‌తో పాటు అత్యాధునిక సదుపాయాలతో కూడి ఉన్న ఈ ఇంటి కోసం యష్ దంపతులు 4 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన ఇంటి గృహప్రవేశ వేడుకను నిరాడంబరంగా చేసుకున్నారు యష్- రాధిక పండిట్ దంపతులు. ఈ కార్యక్రమానికి యష్ తల్లిదండ్రులతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. గృహప్రవేశం తాలూకు ఫొటోల్లో యష్ జోడీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండటంతో వెంటనే వైరల్ అయ్యాయి. ఇవి చూసి తమ అభిమాన హీరోకి కంగ్రాట్స్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇక యష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్-2 సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ రెండో భాగంగా ఈ సినిమాను భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ సంజయ్‌ దత్‌ ఈ మూవీలో విలన్ రోల్ పోషిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రవీనా టాండన్‌, రావు రమేష్‌ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటున్నారు. యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AmepNl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...