Sunday, 18 July 2021

మహేష్ అభిమానులు సందడికి రెడీనా.. ఈ బర్త్‌డేకి సర్‌ప్రైజ్ వస్తుందట.?

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆ థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లు, పాలాభిషేకాలు, టపాసులతో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ వెండితెరపై కనిపించలేదు. దీంతో తమ అభిమాన నటుడిని మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే ‘గీత గోవిందం’ ఫేమ్ దర్శకత్వంలో మహేష్ ప్రస్తుతం ‘’ అనే సినిమాలో నటిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రకటన చేసి చాలాకాలమే అయింది. ఇప్పటివరకూ కేవలం టైటిల్‌ పోస్టర్లు తప్ప.. కనీసం సినిమాలో మహేష్ లుక్‌ ఎలా ఉంటుందో కూడా రివీల్ చేయలేదు. అయితే కరోనా ప్రభావం.. ఈ సినిమాపై తీవ్రంగా చూపించింది. మొదటి వేవ్‌లో లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడటం. అంతా సవ్యంగా మారుతుంది అనే సమయంలో మళ్లీ సెకండ్ వేవ్ రావడం.. షూటింగ్ సెట్‌లో కొందరికి కరోనా రావడం.. దీంతో మహేష్ స్వయంగా ఐసోలేషన్‌లోకి వెళ్లడం.. సినిమా షూటింగ్‌కి చాలా అడ్డంకుటే ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మామూలుగా మారడంతో షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. ఇప్పటికే మహేష్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలో హీరోయిన్ కూడా షూటింగ్‌లో పాల్గొననుంది. వీరితో పాటు.. పెద్ద ఎత్తున జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని బ్యాంకులోని కీలక సన్నివేశాలు.. ఇతర సన్నివేశాలు కూడా ఈ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాగే షూటింగ్‌ కొనసాగితే.. మహేష్ పుట్టినరోజున అంటే ఆగస్టు 9న సినిమా నుంచి సర్‌ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆరోజున సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ లేదా టీజర్ వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయంటూ.. ఫిలిమ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Bf70zL
v

No comments:

Post a Comment