Wednesday, 7 July 2021

విశాఖ తీరాన మహేష్ బాబు.. కెరీర్‌లో తొలిసారి అలా! సూపర్ స్టార్ డేరింగ్ స్టెప్..

వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రస్తుతం '' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. జూలై 12 నుంచి మహేష్ బాబు డేట్స్ ఇచ్చారని, ఈ మేరకు డైరెక్టర్ పరశురామ్ వైజాగ్‌లో ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి 'సర్కారు వారి పాట' షూటింగ్ రెండో షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా అక్కడికి వెళ్లకుండా షూటింగ్‌లో మార్పులు చేసి ఇక్కడే చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు విశాఖ తీరాన పలు లొకేషన్స్ ఫైనల్ చేసిన దర్శకనిర్మాతలు అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉండనుందని తెలుస్తోంది. విశాఖ ఏరియాలోని కొన్ని ప్రాంతాల్లో హీరో, హీరోయిన్లపై ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీన్‌ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకోసం హీరో మహేష్ బాబు డేరింగ్ స్టెప్ వేశారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెంటిమెంట్ ప్రభావమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ ఇప్పటి వరకు తన సినిమాల కోసం సూపర్ స్టార్ వైజాగ్ వెళ్లలేదట. ‘సర్కారు వారి పాట' కోసం మాత్రం కెరీర్‌లో తొలిసారి విశాఖ గడ్డపై ఆయన అడుగుపెడుతున్నారని, ఓ 20 రోజుల పాటు విశాఖ తీరాన్నే ఉండబోతున్నారని అంటున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాను బ్యాకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V4XcI3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...