Thursday, 29 July 2021

శేఖర్ మాస్టర్‌కి శ్రీముఖి ఘాటు ముద్దు.. అంతా చూస్తుండగానే! ఇంట్లో పరిస్థితి అంటూ సీక్రెట్ రివీల్..

బుల్లితెర కార్యక్రమాల ఒరవడి క్రమంగా మారుతూ వస్తోంది. భారీ టీఆర్ఫీ లక్ష్యంగా ట్రెండింగ్ అంశాలు, రక్తి కట్టించే సన్నివేశాలతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ మేరకు పక్కాగా ప్లాన్ చేసి రియాలిటీ షోస్, ఫన్నీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. పైగా దానికి యాంకర్ల అందాల డోస్ యాడ్ చేస్తూ రొమాంటిక్ మూమెంట్స్‌తో మైమరిపిస్తున్నారు. సినిమా రేంజ్‌లో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి ముద్దులు, హగ్గులతో పిచ్చెక్కిస్తున్నారు. ఇలా ఆ మధ్య ఓ సారి కామెడీ స్టార్స్ షోలో శేఖర్ మాస్టర్‌‌కు యంగ్ యాంకర్ ముద్దు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో శ్రీముఖి, కలిసి వేసిన స్టెప్పుల కంటే ఆ ముద్దే అందరినీ ఆశ్చర్యపరిచి చర్చల్లో నిలిచింది. అంతా చూస్తుండగానే ఒక్కసారిగా శ్రీముఖి ఘాటు ముద్దు పెట్టేయడంతో అందరూ షాకయ్యారు. దీంతో ఆ సమయంలో ఈ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా అవినాష్ చేసిన పనితో ఆ ముద్దు ఎపిసోడ్ మళ్లీ హాట్ టాపిక్ అయింది. బాబు మోహన్, కోట శ్రీనివాస రావులను గెస్టులుగా తీసుకొచ్చి ఈ ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా కామెడీ స్టార్స్ ఓ స్పెషల్ ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇందులో శేఖర్ మాస్టర్‌కి అప్పట్లో శ్రీముఖి పెట్టిన ముద్దు విషయం తెర మీదకు తెచ్చాడు అవినాష్. ఆ ముద్దు తెగ వైరల్ అయింది తెలుసా? అని అవినాష్ అనడంతో.. జడ్జి స్థానంలో ఉన్న శేఖర్ మాస్టర్ రియాక్ట్ అవుతూ ఇంటికి వెళ్లాక మా ఇంట్లో వైరల్ ఫీవర్ కూడా వచ్చింది తెలుసా అంటూ తన భార్య ఫైర్ అయిందని ఇన్ డైరెక్ట్‌గా చెప్పాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BTwD9J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...