Monday, 19 July 2021

ఆ సూపర్‌హిట్ సినిమా దర్శకుడితో అఖిల్ నెక్ట్స్‌ మూవీ.. గ్యాప్‌ రాకూడని కొత్త ప్లాన్!

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకూ కరెక్ట్ సక్సెస్‌ని అందుకోలేకపోయాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఏ సినిమా కూడా అతనికి హిట్ అందించలేకపోయింది. ఎంత స్టార్ డైరక్టర్, పెద్ద హీరోయిన్ ఉన్నప్పటికీ.. సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కెరీర్‌ ప్లానింగ్‌లో ఈసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో అతను నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నారు. తాజా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా విడుదల అయింది. ఫస్ట్‌‌లుక్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అఖిల్. అయితే ఇప్పుడు సినిమా సినిమా మధ్య గ్యాప్ రావొద్దు అని కొత్త ప్లాన్‌ని సిద్దం చేస్తున్నాడు అఖిల్. అందుకోసం వెంటవెంటనే సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం అతను చేస్తున్న రెండు సినిమాలతో పాటు మరో కొత్త సినిమాని కూడా లైన్‌లో పెట్టేశాడు ఈ సిసింద్రీ. తాజాగా ‘అందాల రాక్షసి’ వంటి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడితో ఒక సినిమాకు ఓకే చెప్పాడట అఖిల్. ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌ల మధ్యలో హను.. అఖిల్‌కి ఓ మంచి కథ చెప్పగా అది వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది. ‘ఏజెంట్’ సినిమా తర్వాత ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zcRv9P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...