Wednesday, 21 July 2021

కొత్త అవతారం ఎత్తనున్న హీరోయిన్ తాప్సీ.. ‘మిషన్ ఇంపాసిబుల్’ కోసం తొలిసారిగా..

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ పన్ను. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసి హిట్లు అందుకున్న ఆమె.. అనంతరం బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఆమెకు గొప్పగా ఆఫర్లు లభించడంతో.. పూర్తిగా మాకాంని ముంబైకి మార్చేసింది ఈ భామ. ఈ మధ్యకాలంలోనే ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా విడుదలైన ‘హసీనా దిల్రుబా’ అనే సినిమాతో మంచి సక్సెస్‌‌ని అందుకుంది తాప్సీ. ఈ మధ్యకాలంలోనే హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్‌గా మారింది తాప్సీ. సొంతంగా ‘ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్‌’ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభిస్తున్నట్లు తాప్సీ ప్రకటించింది. దీనితో తన జీవితంలో కొత్త అంకం ప్రారంభం అవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే బాలీవుడ్‌లో సినిమాలతో బిజీ అయిన తాప్సీ తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదుగా మారిపోయింది. ఆఖరిగా ఆమె ‘ఆనందో బ్రహ్మ’ అనే సినిమాలో ఆమె కనిపించారు. హారర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో పాటు.. టాలీవుడ్‌లో ‘’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే తాప్సీ ఈ సినిమాలో నటిస్తోందని ప్రకటించి చాలాకాలమైంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా తాప్సీ ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తోందట. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి దీపక్ యారగర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eGhZZq
v

No comments:

Post a Comment