Thursday, 15 July 2021

ఇది నా జుట్టుని నమిలేస్తోంది... క్యూట్ వీడియో షేర్ చేసిన రష్మిక మందన

‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది కన్నడ భామ . ‘గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు భీష్మ’ లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ఒక సినిమా, సిద్ధార్త్ మల్హోత్రాతో మరో సినిమా ఇలా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక. అంతకు ముందు తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అక్కడ కార్తీతో ‘సుల్తాన్’ అనే సినిమాలో నటించి మంచి సక్సెస్‌ని అందుకుంది. ఇక సినిమాలతో పాటు.. సోషల్‌మీడియాలోనూ రష్మిక చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు.. సమాజం గురించి, ప్రజలకు సహాయం చేయడం గురించి కూడా ఆమె తరచూ పోస్ట్ చేస్తుంటుంది. ఆ కోవిడ్ వారియర్స్‌పై వరుసగా పోస్ట్‌లు పెట్టి వాళ్లకు మద్దతు తెలిపింది ఈ భామ. అంతేకాక.. కరోనా గురించి కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతూ ఆమె పోస్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో తనకు ఖాళీ సమయం దొరకడంతో ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తోంది రష్మిక. తన కుక్కపిల్లతో ఆడుకుంటూ ఆ పిక్స్, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన కుక్కపిల్లతో ఆడుకుంటున్న వీడియోని షేర్ చేసింది రష్మిక.. ఈ వీడియోలో రష్మిక కళ్లజోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉంది. ఇక ఆ బుల్లి కుక్కపిల్ల రష్మిక జుట్టుని నములుతోంది. ‘ఛీవ్ స్టిక్స్‌ని నమలడం కంటే.. నా జట్టును నమలడం తనకి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది’ అంటూ రష్మిక పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టకుంటుంది. ‘ఇద్దరు ఎంతో క్యూట్‌గా ఉన్నారు’ అంటూ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xHL6mK
v

No comments:

Post a Comment