Sunday, 4 July 2021

యాంకర్ అరియానా కొత్త వ్యాపారం.. డబ్బు సంపాదనలో భాగంగా బోల్డ్ పాప డేరింగ్ స్టెప్!

నేటితరం సెలబ్రిటీలు డబ్బు సంపాదనలో కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్స్ మొదలుకొని బుల్లితెర యాంకర్ల వరకూ ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని వ్యాపారాలు చేస్తుండటం చూస్తున్నాం. ఓ వైపు తమ వృత్తిని కంటిన్యూ చేస్తూనే మరోవైపు కొత్త కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు నేటితరం తారలు. ఇప్పటికే మహేష్ బాబు, సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ వ్యాపారాల్లో రాణిస్తుండగా తాజాగా అదే బాటలో వెళ్లేందుకు రెడీ అయింది బోల్డ్ యాంకర్ . యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అరియానా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది. కాకపోతే ఒక్క ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. 'నిన్ను బికినీలో చూడాలని ఉంది' అంటూ ఆమెను రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేయడం హాట్ ఇష్యూగా మరి అరియానాకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ గడపతొక్కిన ఈ బోల్డ్ పాప.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలబడి టాప్-5లో నిలిచింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే సోషల్ మీడియాలో రచ్చ చేయడం ప్రారంభించిన ఆమె, రీసెంట్‌గా మరోసారి ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. సో.. ఇంత పాపులారిటీ ఉన్నపుడే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సిచ్యుయేషన్ క్యాష్ చేసుకోవాలని భావించినట్లుంది అరియానా. తాను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించానని, దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది అరియానా. ఇది చూసి ఆమెకు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V6bvw9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...