Monday, 19 July 2021

జబర్దస్త్ వేదికపై సూపర్ ఉమెన్.. కత్తిలా ఉందంటూ కమెడియన్ పంచులు! రోజా, అనసూయ ఫీలింగ్స్ చూస్తే..

అదేంటో ఎన్ని క్యారెక్టర్స్ వేసినా రాని గుర్తింపు అనూహ్యంగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో వచ్చేయడం చూస్తుంటాం. చాలా మంది నటీనటుల విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా. దీంతో అప్పటినుంచి వాళ్ళను అదే క్యారెక్టర్ పేరుతో పిలవడం, వరుస అవకాశాలు రావడం సాదారణంగా జరిగే పరిణామమే. ఇటీవల వచ్చిన 'వకీల్ సాబ్' విషయంలో అదే జరిగింది. ఈ సినిమాతో సూపర్ ఉమెన్‌గా ఆమెను ఫుల్ పాపులర్ చేశారు పవన్ కళ్యాణ్. 'వకీల్ సాబ్' సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ ఉమెన్ సీన్ అలా గుర్తుండిపోతుంది. సూపర్ ఉమెన్ అంటూ సెటైరికల్‌గా పవన్ పేల్చిన డైలాగులు ప్రేక్షకులరు బాగా కనెక్ట్ చేయడమే గాక ఆ క్యారెక్టర్ చేసిన లిరిష అనే నటిని ఒక్కసారిగా ఫేమస్ చేసేశాయి. గతంలో ఎన్నో సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో కూడా నటించిన లిరిషకు ఈ సూపర్ ఉమెన్ ఇమేజ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ''అల్వాల్ నుంచి మొయినాబాద్‌కు సిర్ఫ్ 15 మినిట్ మే వచ్చిండ్రామ్మా మీరు.. సూపర్ ఉమెన్'' అంటూ కోర్టులో పవన్ చెప్పిన డైలాగ్స్ ఆమెను ఫేమస్ చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జబర్దస్త్ వేదికపై ఎంట్రీ ఇచ్చి హల్చల్ చేసింది సూపర్ ఉమెన్. జులై 22న ప్రసారం కాబోతున్న జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో 'ఎక్కడికైనా 15 నిమిషాల్లో వెళ్లిపోయే సూపర్ ఉమెన్‌రా నేను' అంటూ పోలీస్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ సూపర్ ఉమెన్. రాకెట్ రాఘవ స్కిట్‌లో ఆమె ఇరగదీసింది. కత్తిలా ఉందంటూ ఆమెపై కమెడియన్ పంచులు వేయగా, దానిపై సూపర్ ఉమెన్ రియాక్షన్.. ఇదంతా చూసి రోజా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Us1Ksb
v

No comments:

Post a Comment