Monday, 12 July 2021

విడాకులు తీసుకోబోతున్న ప్రియాంక చోప్రా జోడీ..! ఇష్యూ వైరల్.. నెట్టింట దుమ్ముదుమారం

సినీ ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఓ సినీ తార ప్రేమలో పడితే డేటింగ్ మొదలుకొని పెళ్లి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమాయణంలో మునిగిపోయి చెట్టాపట్టాలేసుకు తిరిగిన జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకోవడం కూడా ఇక్కడ కామనే. ఇక పెళ్లి చేసుకున్నాక కూడా ఏదో కారణంతో విడిపోయిన జంటలు లేవని చెప్పలేం. ముఖ్యంగా ఈ కల్చర్ బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ' పెళ్లి పెటాకులు కావడం ఖాయం' అనే టాక్ బయటకురావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌,సైఫ్‌ అలీ ఖాన్‌, సంజయ్‌ దత్‌, ఆమీర్‌ ఖాన్ ఇలా చాలామంది తారలు విడాకుల ట్రాక్‌ ఎక్కి వార్తల్లో నిలిచిన వాళ్ళే. అయితే మరో పదేళ్లలో ప్రియాంక చోప్రా కూడా అదే బాట పట్టబోతోందని జోస్యం చెప్పాడు సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌. ''నిక్ జోనాస్‌కు 10 ఏళ్లలో ప్రియాంక విడాకులు ఇవ్వడం తథ్యం'' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయి దుమారం రేపుతోంది. ప్రియాంక లైఫ్ గురించి కమల్‌ ఆర్‌ ఖాన్‌ చేసిన ఈ కామెంట్లను కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆయనపై ఫైర్ అవుతూ 'అయితే నువ్వు కూడా మరో పదేళ్లకు చస్తావ్' అంటూ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదని కామెంట్ చేస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు, వ్యక్తిగత విషయాలపై ఇలాంటి కామెంట్స్ చేస్తే చితక్కొడతాం అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు కొందరు నెటిజన్లు. వెండితెరపై అందాల విందిస్తూ సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది. పెళ్లి తర్వాత వీలు చిక్కినప్పుడుడల్లా పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తుండటం హాబీగా పెట్టుకుంది ఈ రొమాంటిక్ పెయిర్. అలాంటి ఈ జోడీ విషయమై విడాకుల ఇష్యూ తెరపైకి రావడమనేది బీ టౌన్‌లో పలు చర్చలకు దారితీసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ecDp0a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...