Tuesday, 20 July 2021

నేటికి మూడు ఏళ్లు.. తన రిలేషన్‌షిప్‌పై ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్స్..

భారతదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన నటీనటులు చాలా అరుదు. పేరుప్రఖ్యాలు అంతర్జాతీయ స్థాయిలో వచ్చినప్పటికీ.. నేరుగా హాలీవుడ్‌కి వెళ్లి.. అక్కడ నటించి గుర్తింపు సాధించిన వాళ్లు చాలా తక్కువే. అలా హాలీవుడ్‌కి వెళ్లి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటి . బాలీవుడ్‌లో పలు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత ‘క్వాంటికో’ అనే వెబ్‌సిరీస్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండ.. ప్రదర్శన చేసింది ప్రియాంక. ఈ సిరీస్ తర్వాత హాలీవుడ్‌లో కూడా ఆమెకి భలే క్రేజ్‌ పెరిగిపోయింది. ఈ విషయాలన్ని పక్కనపెడితే.. ప్రియాంక వివాహం పెద్ద ఎత్తున వైరల్ అయింది. తనకంటే దాదాపు పది సంవత్సరాలు చిన్నవాడు అయినా.. పాప్ సింగర్ నిక్ జోనస్‌ని ఆమె 2018లో వివాహం చేసుకుంది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా.. దేనిని ఖాతరు చేయకుండా వీళ్లు ఏడు అడుగులు వేశారు. విదేశీ సాంప్రదాయంతో పాటు.. భారతీయ సాంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. తాజాగా ప్రియాంక, నిక్‌లు ప్రపోజ్ చేసుకొని నేటికి (జూలై 20)కి మూడు సంవత్సరాలు పూర్తయింది. ప్రియాంక సోషల్‌మీడియా ద్వారా గుర్తు చేసుకుంది. మూడు సంవత్సరాల నుంచి తన సర్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. అసలు ఈ కాలం మొత్తం ఓ రెప్పపాటులా ఉందంటూ ఆమె పేర్కొంది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నిక్ జోనస్ కూడా దీనిపై పోస్ట్ చేశారు ‘నేటికి మూడు సంవత్సరాలు’ అంటూ ఆయన పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hSjUw2
v

No comments:

Post a Comment