Friday, 2 July 2021

హైపర్ ఆది లవ్ సీక్రెట్స్ రివీల్.. ప్రియమణి ముందే నేరుగా వచ్చి ముద్దుపెట్టిన పూర్ణ! అంతా షాక్..

రోజు రోజుకూ బుల్లితెర షోస్ హవా రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై వెండితెర తారల సందడి కూడా పెరిగిపోయింది. , రోజా, ఇంద్రజ, లాంటి స్టార్స్ చిన్నితెరపై ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక వాళ్ళతో బుల్లితెర స్టార్స్ అయిన , సుడిగాలి సుధీర్ లాంటి కమెడియన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. ప్రతి ప్రోగ్రాంలోను ఇదే హంగామా కనిపిస్తోంది. మరోవైపు షోలో జరిగిన అలాంటి ఆసక్తికర సన్నివేశాలను ప్రోమో రూపంలో రిలీజ్ చేసి సదరు ఎపిసోడ్‌పై భారీ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమో వీడియోలో చూపించిన సీన్స్ వైరల్ అవుతున్నాయి. తగ్గేదే లే.. అని సుడిగాలి సుధీర్ అంటుంటే.. ఓ కంటిస్టెంట్ చేసిన డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూసి నేరుగా వచ్చి అతనికి ముద్దు పెట్టేసింది జడ్జి పూర్ణ. ఇక హైపర్ ఆది రాసిన లవ్ లెటర్ ఈ వీడియోలో హైలైట్ అయింది. ఒకప్పుడు డాన్స్ షోస్‌ అంటే జడ్జ్ సీటులో కూర్చున్న జడ్జెస్ మార్కులు మాత్రమే వేసేవారు. కానీ రాను రాను సీన్ మారిపోయింది. షోలో జడ్జెస్‌పై కంటిస్టెంట్స్ జోకులు వేయడం, వాళ్ళతో రొమాంటిక్ డోస్ పండించడం లాంటివి షురూ అయ్యాయి. తాజా ప్రోమో వీడియోలో అదే సీన్ కనిపించింది. ఓ కంటిస్టెంట్ డాన్స్ చూసి ఫిదా అయిన పూర్ణ.. అభి అంటూ అతనికి లవ్ సింబల్ చూపిస్తూ ఆ తర్వాత నేరుగా వేదికపైకి వచ్చి కిస్ చేసింది. ఇకపోతే హైపర్ ఆది రాసిన లవ్ లెటర్ మొత్తం యాంకర్ ప్రదీప్ చదివి వినిపించడంతో అంతా షాకయ్యారు. సో.. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qGXGzN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...