Wednesday, 28 July 2021

బార్లు, పబ్బుల కంటే దారుణమా? థియేటర్స్ ఇష్యూపై నాని షాకింగ్ కామెంట్స్.. ప్రభుత్వాలపై ఫైర్!

గత రెండేళ్లుగా థియేటర్స్ వ్యవస్థ మరుగున పడింది. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ బోసిపోయాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్ల గేట్లకు తాళాలు పడటంతో సగటు ప్రేక్షకుడికి వినోదం కరువవ్వడమే గాక, సినిమా హాల్స్‌పై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఇదే విషయమై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోవిడ్ టైమ్‌లో ముందుగా మూతపడినవి థియేట‌ర్స్‌ అయితే.. చివ‌ర‌గా ఓపెన్ అయ్యేవి కూడా థియేట‌ర్సే. ఈ విషయమై సగటు ప్రేక్షకుడి స్థానంలో ఉండి తన అభిప్రాయం వెల్లడిస్తూ కుండబద్దలు కొట్టేశారు నాని. నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే పట్టించుకోని పాలకులు.. థియేటర్లపై మాత్రం ఎక్కడలేని ఆంక్షలు పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు. రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు ఇతర ప్రదేశాలతో పోల్చితే థియేట‌ర్స్ చాలా సేఫ్ అని పేర్కొన్న నాని.. సినిమా అనేది మన కల్చర్, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం అనేది మన బ్లడ్ లోనే ఉందని అన్నారు. థియేట‌ర్లలో ఒకరితో ఒకరం మాట్లాడుకోం.. మాస్క్‌లు వేసుకుని సినిమా చూస్తామని, అదే బార్లలో అయితే పరిస్థితి మరోలా ఉంటుందని అన్నారు. మనం మన ఇంటి తర్వాత ఎక్కువసేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే అని నాని చెప్పడం గమనార్హం. థియేటర్ వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవిస్తున్నారని, వాళ్లంతా పనులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని నాని తెలిపారు. పరిస్థితులు ఇలాగే ఉంటే భవిష్యత్‌లో థియేటర్ వ్యవస్థ నాశనం అయ్యే ప్రమాదం లేకపోలేదని అన్నారు. సినిమా చూడ‌ట‌మ‌నేది ఓ మ్యాజిక‌ల్ ఫీలింగ్‌ అని, నెక్ట్స్ జ‌నరేష‌న్ దాన్ని మిస్ అవుతుందేమోనని తెలిపారు. సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరైన నాని చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం తీరుపైనే నాని ఈ రకంగా విమర్శలు చేశారని జనం చెప్పుకుంటున్నారు. నేరుగా ప్రభుత్వంపై కామెంట్ చేయకపోయినా ఆయన ఆవేదన వెనుక అర్థం అదే అనే టాక్ నడుస్తోంది. పెద్ద సినిమాలకు టికెట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో స్పందించకపోవడమే నాని ఆవేదనకు ఓ కారణమై ఉంటుందని చెప్పుకుంటున్నారు జనం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l2dKLJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...