Sunday, 18 July 2021

గత రాత్రి మేమంతా..! నమ్రత శిరోద్కర్ పోస్ట్ వైరల్.. చిరంజీవి చిన్న కూతురు, ఉపాసన కూడా అక్కడే

రామ్‌చరణ్ సతీమణి ఉపాసన చెల్లెలు తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంని పరిచయం చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నామనే విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేయడం, ఉపాసన కూడా ‘నా డార్లింగ్స్‌కి అభినందనలు’ పేర్కొనడంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. అయితే గత రాత్రి వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఫినిష్ అయింది. ఈ వేడుకకు అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా కారణంగా చాలా తక్కువ మందిని ఈ ఈవెంట్‌కి ఆహ్వానించారట. ఇందులో మహేష్ బాబు భార్య కూడా ఉంది. నిన్న ఈ ఈవెంట్‌కు హాజరైన నమ్రత.. ఈవెంట్ జరిగిన కొద్ది సేపటికి తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఓ పిక్ పోస్ట్ చేసింది. ఇందులో నమ్రతతో పాటు ఉపాసన, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఉపాసన మరదలు శ్రీయ భూపాల్ తదితరులు కనిపించారు. ఈ ఎంగేజ్మెంట్‌కి హాజరైన అందరినీ పేరుపేరునా టాగ్ చేస్తూ బాస్ లేడీ ట్రైబ్ అంతా ఒకచోట చేరాము అంటూ కామెంట్ చేసింది నమ్రత శిరోద్కర్. అయితే ఈ ఫొటోలో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి కనిపించక పోవడంతో ఈ బ్యూటిఫుల్ ఫ్రేమ్‌లో ఆమెను మిస్ అయ్యాం అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన చెల్లెలు అనుష్పాల కామినేని చేసుకోబోయే అర్మాన్ ఇబ్రహీం కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా ఆయనతో ప్రేమలో ఉన్న అనుష్పాల ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫినిష్ చేసుకొని అతిత్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. అనుష్పాల పెద్దగా జనాలకు తెలియకపోయినా ఉపాసన చెల్లెలు కావడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UrpvjX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...