Monday, 12 July 2021

ఆరు గజాల్లోని అద్భుతమైన అందం ఇది.. దానిపై అనన్య నాగల్ల కామెంట్స్

సినిమాలో నటించాలంటూ.. రంగంలోకి దిగిన ప్రతీ ఒక్కరికి.. ఏదో ఒక సమయంలో బ్రేక్ రావడం.. ఆ తర్వాత వాళ్లు ఎంతో ఫేమస్ అవ్వడం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. తొలి సినిమాతో మంచి బ్రేక్ వచ్చి.. ఆ తర్వాత మంచి సక్సెస్‌ఫుల్ కెరీర్ నడిపిన వాళ్లు కొందరైతే.. మరికొందరు.. చాలాకాలం బ్రేక్ దొరక్క ఎక్కడ కెరీర్ మొదలు పెట్టారో అక్కడే మిగిలిపోతారు. అలా చేసినవి రెండు సినిమాలే అయినా.. మరి బ్రేక్ లభించిన నటి . తొలి సినిమా ‘మల్లేశం’తోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్’తో ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సిమిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ ఈ అవకాశాన్ని చేజార్చుకోలేదు. వెంటవెంటనే తన అందాలను ఎలివేట్ చేస్తూ.. ఫోటోషూట్‌లు నిర్వహిస్తూ.. ఆ పిక్స్‌ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. ముఖ్యంగా ఆ మధ్యకాలంలో తన నాభి అందాలను ప్రదర్శిస్తూ ఈ భామ పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా అనన్య ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. సాధారణంగా ఏ తెలుగు అమ్మాయికైన చీరలు ధరించడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎప్పుడైనా చీర ధరిస్తే.. అందులో ఎన్నో పిక్స్ దిగి వాటిని సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటుంటారు. అనన్య నాగల్లా కూడా ఇదే కోవకు చెందిన యువతి. అందుకే ఈ మధ్య చీరలో ఆమె చేసిన ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ‘ఆరు గజాల్లోని అద్భుతమైన అందం ఇది’ అంటూ చీరపై తనకున్న ప్రేమను ప్రదర్శించింది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xBygXd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...