Wednesday, 14 July 2021

'కేజీఎఫ్' ఫేమ్ యష్‌తో పక్కా స్కెచ్చేసిన బోయపాటి.. భారీ రేంజ్ మూవీ ప్లాన్ చేసిన మాస్ డైరెక్టర్

సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన ఈ డైరెక్టర్ థియేటర్స్‌లో గోల పెట్టిస్తుంటారు. ఇక ప్రేక్షకులకు ఇదే రేంజ్‌లో ఊపుతెప్పించే హీరో యష్. 'కేజీఎఫ్' సినిమాతో ఆయన పాపులారిటీ ఎల్లలు దాటింది. అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబో సెట్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని కన్నడ హీరో, 'కేజీఎఫ్' ఫేమ్ యష్‌తో చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయనతో కథా చర్చలు పూర్తయ్యాయని, మాస్ ఆడియన్స్ ఊగిపోయేలా కథ సిద్దం చేసిన బోయపాటి, యష్‌తో గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారని అంటున్నారు. బడా బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం బోయపాటి చేస్తున్న 'అఖండ' మూవీ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు రావొచ్చని తెలుస్తోంది. ఇకపోతే బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న 'అఖండ' మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. థమన్ బాణీలు కడుతున్నారు. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kfTyFP
v

No comments:

Post a Comment