Friday, 23 July 2021

లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్.. ఫస్ట్ రైడ్ ఎక్కడికంటే?

మెగా నందమూరి బంధం ఎప్పుడూ చిత్ర విచిత్రంగానే ఉంటుంది. చిరంజీవి బాలయ్య మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేకపోయినా కూడా ఎన్టీఆర్ మధ్య మాత్రం గట్టి స్నేహబంధం ఏర్పడింది. ఈ ఇద్దరి ఫ్రెండ్ షిప్‌కు తగ్గట్టే దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇద్దరు స్నేహితులను ఒకే తెరపై చూసేందుకు వారి అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కాసేపు ఈ విషయాలు పక్కన పెడితే.. తాజాగా లగ్జరీ కారును కొన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త మోడల్స్‌ను కొనడం యంగ్ టైగర్‌కు మక్కువ. అలా కొత్తగా ఓ కారును కొనేశారు ఎన్టీఆర్. ఆ మధ్య ప్రభాస్ లంబోర్గి కారును కొనడం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో ప్రభాస్ చక్కర్లు కొట్టడం,ముంబై వీధుల్లో ప్రభాస్ రేంజ్ మాట్లాడుకోవడం నెట్టింట్లో వైరల్ అయింది. తాజాగా ఎన్టీఆర్ సైతం ఐదు కోట్ల విలువైన లంబోర్గిని సొంతం చేసుకున్నాడని, ఫస్ట్ రైడ్‌గా రామ్ చరణ్ ఇంటికి వెళ్లాడని అంటున్నారు. ఈ మేరకు రామ్ చరణ్ ఇంటి ముందున్న ఈ లగ్జరీ కారు ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ ఈ కొత్త కారును కొనడంపై నిజం లేదని స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ కొత్త కారు అంటూ ఓ ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమాలు చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kQYpxG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...