Saturday, 17 July 2021

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన జక్కన్న.. ఇది బయటకొస్తే ఇక రచ్చరచ్చే!

‘బాహుబలి’ లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి కారణంగా రెండు సార్లు వాయిదాపడటం.. ఈ క్రమంలో సినిమా విడుదల కూడా వాయిపడటం అభిమానులను నిరాశపరిచింది. అయితే అభిమానులకు మాత్రం జక్కన ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇస్తూ వచ్చాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వాళ్ల పుట్టినరోజుల సందర్భంగా వాళ్లకు సంబంధించిన టీజర్లు లేదా పోస్టర్లను విడుదల చేశాడు. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాక.. రీసెంట్‌గా ‘’ పేరుతో సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఇది ప్రస్తుతం ప్రేక్షకులను విశేసంగా ఆకట్టుకుంటోంది. అన్నికంటే ముఖ్యంగా సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేస్తామని ఇందులో ప్రకటించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుటికే ఫుల్ ఖుషీలో ఉన్న అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అదేంటే.. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్‌లా.. సినిమాకు సంబంధించి ప్రమోషనల్ సాంగ్‌ని రూపొందించే ప్రయత్నంలో ఆయన ఉన్నారట. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలను ఈ సాంగ్ ద్వారా ప్రజలకు తెలియజేసేలా చేయాలనే యోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BbYWjt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...