Thursday, 1 July 2021

Balakrishna: 'అఖండ' విడుదలపై రూమర్స్.. రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇచ్చేసిన బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను- క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ''. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, షూటింగ్స్ రద్దు కావడంతో అది సాధ్యం కాలేదు. పైగా ఇంకా షూట్ చేయాల్సిన కొంత పార్ట్ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర రిలీజ్ విషయమై రకరకాల రూమర్స్ బయటకు రావడంతో డైరెక్టర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట, చిన్న ప్యాచ్ వర్క్, క్లైమాక్స్ షూట్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ కోసం లొకేషన్స్ వేటలో ఉన్నారు బోయపాటి. ఇందుకోసం కడప, చిత్తూరు జిల్లాల్లోని చారిత్రక ప్రదేశాలను పరిశీలిస్తున్నారట. ఈ మేరకు అతిత్వరలో చివరి షెడ్యూల్ ప్రారంభించి షూట్ ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేశారట. అయితే రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ గురించి చిన్న క్లారిటీ ఇచ్చారు బోయపాటి. క్లైమాక్స్ సన్నివేశాలు మినహాయిస్తే షూట్ చాలా చక్కగా పూర్తయిందని చెప్పిన బోయపాటి.. ఇప్పటి వరకు విడుదల తేదీని లాక్ చేయలేదని అన్నారు. కోవిడ్ -19 థర్డ్ వేవ్ కూడా దృష్టిలో పెట్టుకొని రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని, ప్రేక్షకులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UXRrvS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...