Monday, 12 July 2021

AGENT షూటింగ్ ప్రారంభం.. గన్ అందులో పెట్టేసిన అఖిల్

అక్కినేని ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. తన కొత్త సినిమా కోసం అఖిల్ మేకోవర్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఒక్క హిట్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన అఖిల్‌కు రూపంలో హిట్ పడేలానే ఉంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలతో బోల్తా పడ్డ అఖిల్ ఇప్పుడు మంచి సబ్జెక్ట్‌లతో రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ అంచనాలు పెంచేశారు. ఇక ఇప్పుడు ఏజెంట్ అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంత వరకు అఖిల్ తన లుక్కును ఏ మాత్రం మార్చలేదు. గడిచిన మూడు సినిమాల్లోనూ లుక్స్ పరంగా ఏమీ అంత కొత్తగా అనిపించలేదు. అయితే ఏజెంట్ సినిమా కోసం మాత్రం అఖిల్ గత ఏడాది నుంచి కష్టపడుతూనే ఉన్నారు. శరీరాకృతిని పూర్తిగా మార్చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. నిన్న వదిలిన ఓ పోస్టర్‌ను చూసి అందరూ అవాక్కయ్యారు. అది అఖిలేనా? అని షాక్ తిన్నారు. ఇక తాజాగా ఏజెంట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గడంతో అందరూ షూటింగ్‌లను ప్రారంభించేశారు. అఖిల్ కూడా ఏజెంట్ కూడా సెట్స్ మీదకు అడుగుపెట్టేశారు. షూటింగ్ ప్రారంభం అంటూ ఏజెంట్ చిత్రయూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. దీంతో పాటు ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. గన్ అందరూ వెనకభాగంలో పెట్టుకుంటే మన అయ్యగారు మాత్రం ముందు భాగంలో పెట్టేసుకున్నారు. మొత్తానికి సిక్స్ ప్యాక్‌తో అఖిల్ రచ్చ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xDq0G3
v

No comments:

Post a Comment