Saturday, 24 July 2021

‘బిచ్చగాడు 2’ కోసం కొత్త అవతారం.. విజయ్ ఆంటోనీ మామూలోడు కాదు!

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. డబ్బింగ్ రూపంలో వచ్చిన సరే ఇక్కడ ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఇక విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా నిర్మాత, సంగీత దర్శకుడిగా ఇలా భిన్న క్రాఫ్ట్‌ల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఎడిటర్‌గా కూడా అయన కొన్ని సినిమాలకు పనిచేయగా ప్రస్తుతం తొలిసారి అయన దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిచ్చగాడు సినిమాకి కొనసాగింపుగా బిచ్చగాడు 2ను గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.ఇక ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబందించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iHyWUB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...