దళపతి ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. విజయ్ బర్త్ డే (జూన్ 21) సందర్భంగా వదిలిన కొత్త సినిమా అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులు ఈ మేరకు వార్తలు రాసాగాయి. విజయ్ బర్త్ డే సందర్భంగా 65వ సినిమా అప్డేట్ వస్తుందని వార్తలు వచ్చాయి. అలా అప్పటి నుంచి అభిమానులు విజయ్ బర్త్ డే కోసం ఎంతో ఆశగా, ఆత్రుతతో ఎదురుచూశారు. అయితే వారి ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం వచ్చేసింది. తాజాగా దళపతి విజయ్ 65వ మూవీ అప్డేట్ వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా రాబోతోన్న ఈమూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నెల్సన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలను అనుసరించే అతి తక్కువ మంది సమక్షంలోనే పూజా కార్యక్రమాలను జరిపించారు. ఈ ఈవెంట్‌కు పూజా హెగ్డే గైర్హాజరయ్యారు. వేరే మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. అయితే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంటూ ఇంగ్లీష్ టైటిల్‌తో విజయ్ రచ్చ చేయనున్నారు. ఇక గన్ పట్టుకుని విలన్లను పరిగెత్తించేందుకు విజయ్ రెడీ అవుతున్నట్టున్నారు. మొత్తానికి విజయ్ తన అభిమానులకు బర్త్ డే సందర్బంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేశారు. అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xIQ4zn
v
No comments:
Post a Comment