Monday, 7 June 2021

Sonu Sood : చిరంజీవి, రామ్ చరణ్‌లపై ప్రశంసలు.. ఆక్సిజన్ బ్యాంక్‌లపై సోనూ సూద్ కామెంట్స్

ప్రస్తుతం సోనూ సూద్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించారు. పేదల పాలిట ఆపద్భాందవుడిగా మారిపోయారు. సాయం కోరిన ప్రతీ ఒక్కరికి అభయహస్తం ఇస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ప్రజల్లో దేవుడిగా మారిపోయారు. అలాంటి సోనూ సూద్ తాజాగా , రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. కరోనా కాలంలో సోనూ సూద్ చేసిన, చేస్తోన్న సేవల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. దేశానికి ఆక్సిజన్ కొరత ఉన్న సమయంలో సోనూ సూద్ క్షణాల్లో వాటిని అందరికీ చేరవేశారు. అలా ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు చిరంజీవి ముందుకు వచ్చారు. బ్లడ్ బ్యాంక్ తరహాలో ఆక్సిజన్ బ్యాంకులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. చిరు చేస్తోన్న ఈ మంచి పనికి మీడియాలో అంత ఆదరణ లభించలేదు. కానీ సోనూ సూద్ మాత్రం చిరంజీవి, రామ్ చరణ్‌లు చేస్తోన్న ఈ బృహత్తర కార్యక్రమంపై స్పందించారు. చిరంజీవి, రామ్ చరణ్‌ల నిర్ణయం ఎంతో గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం, ఈ క్రమంలోనే మిగతా సెలెబ్రిటీలు ముందుకు రావాలి. వారికి చేతనైన సాయం చేయాలి. అప్పుడు ప్రజల్లో ఓ గట్టి నమ్మకం ఏర్పడుతుంది. వారు ధైర్యంగా ఉండగలరు. ప్రతీదీ ప్రభుత్వం చేస్తుందని ఎదురుచూడకూడదని అన్నారు. ఇక ఆచార్య సినిమాపైనా సోనూ సూద్ స్పందించారు. సోనూసూద్‌ను పాత్రను పోషించే నటుడిగానే చూడండి అనే డిస్ క్లెయిమర్ వేయాలని చిరంజీవి అన్నారట. లేదంటూ సోనూ సూద్‌కు ఇప్పుడున్న ఇమేజ్‌కు విలన్‌గా చూడలేరని, ఫైటింగ్ చేసి అతడిని కొట్టినా జనాలకు నచ్చదని చిరంజీవి అన్నారని సోనూ సూద్ తెలిపారు. తన కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా మార్చారని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sh5lYY
v

No comments:

Post a Comment