Thursday, 3 June 2021

RRR సీక్రెట్ లీక్.. రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య భీకర పోరు.. గుట్టు విప్పిన రచయిత!

మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించడం అంత మామూలు విషయమేమీ కాదు. హీరోల ఇమేజ్, అభిమానుల అంచనాలను అందుకునేలా తెరకెక్కించడం కత్తి మీద సాము వంటిది. మరీ ముఖ్యంగా సదరు హీరోల స్క్రీన్ స్పేస్, పాటలు, ఫైట్లు, సీన్లు ఇలా ప్రతీ ఒక్క విషయంలో లెక్కలు వేసుకుని మరీ తెరకెక్కించాల్సి ఉంటుంది. హీరోయిజాన్ని ఎలా చూపించాలి.. సగటు సినీ ప్రేక్షకుడిని ఎలా కట్టిపడేయాలో తెలిసిన రాజమౌళి సినిమాను ఎలా తెరకెక్కిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌ను ఏలేస్తోన్న ఇద్దరు పెద్ద స్టార్లను ఒకే స్క్రీన్ మీదకు తెచ్చేందుకు రాజమౌళి పూనుకున్నాడంటే ఆ కథ, కథనంలో ఉండే దమ్ము గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వదిలిన మోషన్ పోస్టర్లు, ఇంట్రో టీజర్లు, పోస్టర్లు అన్నీ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. నీరు, నిప్పు కలయిక అంటూ , రామ్ చరణ్‌ల పాత్రల స్వభావాన్ని రాజమౌళి చెప్పకనే చెప్పేశారు. ఇక ఆర్ఆర్ఆర్ కథా రచయిత ఈ మధ్య చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయని అన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఈ స్థాయిలో ఎమోషన్స్ ఉంటాయా? అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా వాటిపై విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన క్లారిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎన్టీఆర్ మధ్య బీకర యుద్ద సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. మన అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది. ఇద్దరూ మంచి వాళ్లే.. కలుస్తారని తెలుసు.. అయినా కూడా ఇద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది అని విజయేంద్ర ప్రసాద్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఆ ఫైట్ ఎప్పుడు? వస్తుంది.. ఎలాంటి పరిస్థితిలో వీరు యుద్దానికి దిగుతారు? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి ఇలా ఓ మంచి సీన్ లీకైపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RmddYO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...