Saturday, 26 June 2021

Pushpa : రిలీజ్‌కు ముందే వేట.. పుష్ప ఖాతాలో మరో రికార్డ్.. బన్నీ మామూలోడు కాదు

అల్లు అర్జున్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు మించేలా హ్యాట్రిక్ కొట్టేందుకు సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బన్నీని ప్యాన్ ఇండియన్ స్టార్‌ను చేసే బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. అలా సినిమాతో బన్నీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ క్రమంలోనే పుష్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మధ్యే పుష్పకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. పుష్పను రెండు భాగాలుగా తీర్చి దిద్దబోతోన్నారట. అలా మొత్తానికి పుష్ప రెండు భాగాలతో బన్నీ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నారు. అయితే అంతకుముందే బన్నీ రికార్డులతో ఆట ఆడుకుంటున్నారు. పుష్ప పోస్టర్లు, పుష్ప ఇంట్రడక్షన్ టీజర్ సోషల్ మీడియాలో ఎంతటి సునామిని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక యూట్యూబ్‌లో మొదటి సారిగా 50 మిలియన్లు కొల్లగొట్టిన టీజర్‌గా టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలా సినిమా విడుదలకు ముందే పుష్ప ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐఎండీబీ(ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్)కి ఉన్న ఆదరణ తెలిసిందే. అందులో పుష్ప తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇండియాలో ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న మూవీ లిస్ట్‌లో పుష్ప రెండో స్థానాన్ని దక్కించుకుని వారెవ్వా అనిపించింది. మొత్తానికి దేశ వ్యాప్తంగా పుష్ప వైబ్స్ కనిపిస్తున్నాయనే దానికి ఇదే ఉదాహరణ. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా, రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dcSEFO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...