Tuesday, 1 June 2021

Pushpa: సుకుమార్ పర్ఫెక్ట్ ప్లాన్.. బన్నీతో పాటు మరో హీరోను భాగం చేయబోతున్న క్రేయేటివ్ డైరెక్టర్

సినిమా అంటే ఎలాంటి వైవిద్యం ఉంటుందనేది మనందరికీ తెలుసు. రొటీన్‌కి బిన్నంగా క్రియేటివ్ ఆలోచనలతో ముందుకెళ్తుంటారు సుక్కు. ఈ నేపథ్యంలోనే తన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ '' కోసం ఎన్నోరకాల ప్లాన్స్ వేస్తూ చకచకా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారాయన. అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరోను కూడా భాగం చేయాలని ఆయన ప్రయత్నాలు షురూ చేశారట. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఒకానొక సమయంలో లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన తరుణ్‌ని 'పుష్ప' మూవీలో భాగం చేయబోతున్నారట సుక్కు. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే.. కెమెరా ముందు కాకుండా కెమెరా వెనకాల ఆయనతో మ్యాజిక్ చేసేలా సుక్కు స్కెచ్చేశారట. ఈ భారీ సినిమాలో గ్రేట్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఆయనకు డబ్బింగ్ చెప్పే అవకాశం తరుణ్‌కి ఇస్తున్నారట సుకుమార్. ఇప్పటికే 'అనుకోని అతిథి' సినిమాలో నటుడు ఫహాద్ ఫాజిల్‌కి డబ్బింగ్ చెప్పారు. ఆ డబ్బింగ్ అద్భుతంగా రావడంతో సుకుమార్ ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో మాస్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' అప్‌డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఇందులో యాంకర్ అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తోందని తెలియడం ప్రేక్షకుల్లో ఆతృతను పెంచేసింది. సో.. చూడాలి మరి ఈ సినిమాను సుక్కు ఏ స్టైల్‌లో ప్రెజెంట్ చేస్తారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34DrYJF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...