Wednesday, 9 June 2021

Pujitha Ponnada : ఆ శుభవార్త ఇదే.. అప్డేట్‌తో హల్చల్.. నోయల్ జీవితంలో కొత్త ఆరంభం

సింగర్, ర్యాపర్, నటుడిగా ఇలా పలు రకాలుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటుడిగా అయితే పలు రకాల పాత్రలను పోషించారు. విలన్, కమెడియన్, హీరో ఫ్రెండ్‌గా ఇలా చాలా సినిమాల్లో కనిపించారు. బిగ్ బాస్ షో ద్వారా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అలా మొత్తానికి నోయల్‌కు సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ క్రేజ్ వచ్చింది. రెండ్రోజుల క్రితం నోయల్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పబోతోన్నానంటూ ప్రకటించేశారు. అలా నోయల్ చేసిన పోస్ట్ ఎన్నో కొత్త అనుమానాలకు దారి తీసింది. అయితే అలా నోయల్ చేసిన పోస్ట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అందరూ కూడా రెండో పెళ్లిపైనా రియాక్ట్ అయ్యారు. ఎగ్జైట్ న్యూస్ అని చెప్పడంతో అంది కచ్చితంగా పెళ్లి గురించి అయి ఉంటుందని మాట్లాడుకున్నారు. అయితే తాజాగా నోయల్ అసలు విషయం చెప్పారు. తన జీవితంలోని కొత్త ఆరంభం గురించి ప్రకటించేశారు. తన హీరోగా రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్‌ను ఇచ్చేశారు. దీంతో నోయల్ ఫుల్ ఖుషీ అవుతున్నట్టు తెలుస్తోంది. హీరోగా తనది తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక నోయల్‌కు ఎప్పటి నుంచో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను మొదటగా నటించిన సినిమాను చూపించేందుకు తన తండ్రిని తీసుకెళ్లిన ఘటన, అక్కడ తనను కొందరు సెల్ఫీలు అడిగిన విషయం గురించి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో నోయల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సోలో హీరోగా నోయల్ ఇంత వరకు ఎంట్రీ ఇవ్వలేదు. నేడు ఆ అవకాశం వచ్చింది. అనే సినిమాతో హీరోగా నోయల్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. హీరోయిన్‌గా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. స్పార్క్ ఓటీటీలో ఈ మూవీ జూన్ 18 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. వినోద్ నాగుల దర్శకత్వం వహించగా.. సత్యనారాయణ నాగుల ఈ మూవీని నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w8bFAO
v

No comments:

Post a Comment