Sunday, 6 June 2021

NTR 30 సెన్సేషనల్.. యంగ్ టైగర్‌తో చర్చించాక ఫైనల్ అయిన కొరటాల శివ!

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉండటంతో ప్రతి ఒక్కరి చూపు ఆయన తదుపరి ప్రాజెక్టుపై పడింది. ఇంతలోనే ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో తెరపైకి వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఊహాగానాలు మిన్నంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ కాంబోలో మూవీ అని ప్రకటన రావడం నందమూరి అభిమానులను ఫిదా చేసింది. దీంతో ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట కొరటాల. నటీనటుల ఎంపిక మొదలుకొని సినిమా టైటిల్ వరకూ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి '' అనే పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ మొదలైంది. ఎన్టీఆర్‌తో చర్చించి కథకు యాప్ట్ అయ్యేలా ఈ టైటిల్ అనుకున్నారని ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న మాట. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. అటు ఎన్టీఆర్ తన RRR ఫినిష్ చేసి, ఇటు కొరటాల శివ తన 'ఆచార్య' మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నారట. ఏదేమైనా సామాజిక సందేశాలతో కూడిన కథ రాసుకొని వెండితెరపై మెప్పించగల సత్తా ఉన్న కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా అంటే అది నిజంగా సెన్సేషనే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fVwklR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...