Thursday, 24 June 2021

Lingusamy : స్క్రిప్ట్ వినకుండా ఓకే చెప్పేసిన రామ్.. ఇస్మార్ట్ హీరోది సాహసమే!

ఇస్మార్ట్ హీరో చేసింది సాహసమేనని నెటిజన్లు అంటున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌తో అందరూ షాక్ అవుతున్నారు. స్క్రిప్ట్ వినకుండానే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేశారా? అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. RED సినిమా ఫలితం కాస్త తేడా కొట్టడంతో రామ్ ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఎంచుకున్నారు. ఈక్రమంలో ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పారు. తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్‌ను రామ్ ప్రకటించారు. మంచి ఫాంలో ఉన్న హీరో అసలు స్క్రిప్ట్ వినకుండానే సినిమాకు ఓకే చెప్పడం ఏంటని అభిమానులు కూడా ఆశ్చర్యపోతోన్నారు. ఆ మధ్య లైన్ చెప్పడం, అది తెగ నచ్చడంతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఈ గ్యాప్‌తో పూర్తి కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రామ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మొత్తానికి ఫైనల్ నెరేషన్ పూర్తి అయింది.. అదిరిపోయింది.. లవ్యూ లింగుస్వామి సర్.. సూపర్ డూపర్‌గా ఉంది.. ఇక మొదలుపెట్టేద్దాం అంటూ రామ్ రెడీగా ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ స్క్రీన్స్‌పై నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఈ చిత్రంలో హీరో రామ్ సరసన.. కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gY2TPy
v

No comments:

Post a Comment