Saturday, 26 June 2021

Kaushal Manda : Uday Kiran Birth Anniversary.. ప్రతీ క్షణం మిస్ అవుతున్నా.. కౌశల్ ఎమోషనల్

చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే ఇలా వరుసబెట్టి హిట్ల మీద హిట్లు కొట్టి స్టార్ హీరో అయిపోయారు ఉదయ్ కిరణ్. అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోల వారసులు బరిలో ఉన్నా కూడా స్టామినా ముందు నిలబడలేకపోయారు. అలా కెరీర్‌లో అంతటి స్థాయిని చూసిన ఉదయ్ కిరణ్.. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. పర్సనల్, ప్రొఫెషనల్‌గానూ ఉదయ్ కిరణ్ జీవితంలో ఓ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ తరువాత ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. అలా చివరకు 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యుడి కిరణాల్లా ఎంత త్వరగా ప్రకాశించాడో.. అంతే త్వరగా అస్తమించారు. కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్‌లతో పాటు డిజాస్టర్లను సైతం చవిచూశారు. ఇక చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ అలా తన ప్రాణాన్ని తానే తీసుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చుట్టూ ఎన్నెన్నో రూమర్లు, ఇంకెన్నో కథనాలు వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనమైందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతుంటాయి. ఆ కాంట్రవర్సీని కాసేపు పక్కన పెడితే.. నేడు ఉదయ్ కిరణ్ జయంతి. ఈ సందర్భంగా సినీ అభిమానులు, సెలెబ్రిటీలు ఆయన్ను తలుచుకుంటున్నారు.ఈ క్రమంలో ఆయనతో కలిసి నటించిన ఎమోషనల్ అయ్యారు. ఉదయ్ కిరణ్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన బిగ్ బాస్ విజేత తాజాగా చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. ‘నా ప్రియమైన స్నేహితుడు ఉదయ్ కిరణ్ జయంతి నేడు. స్వర్గంలో ఉన్న నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేను నిన్ను మిస్ అవ్వని క్షణం అంటూ ఉండదు. మనిద్దరం కలిసి ఉన్న రోజులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నీతో ఉన్నక క్షణాల్లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా కెరీర్‌లో 8 చిత్రాల్లో నీతో కలిసి నటించాను.. అది ఎంతో సంతోషంగా ఉంది’ అని ఉదయ్ కిరణ్‌ను తలుచుకుంటూ కౌశల్ ఎమోషనల్ అయ్యారు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం వంటి సినిమాల్లో ఉదయ్ కిరణ్‌తో కౌశల్ నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vVEJub
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...