Saturday, 19 June 2021

Jagamae Thandhiram.. సోషల్ మీడియాలో ధనుష్ ట్రెండ్

కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు ఈ సినిమా 190 దేశాల్లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆ చిత్రయూనిట్ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేసింది. అలా మొత్తానికి నిన్న మధ్యాహ్నం నుంచి జగమే తంత్రం సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా కూడా ధనుష్ హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు. ట్విట్టర్‌లో జగమేతంత్రం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. సాధారణ కథ, ఇంతకు ముందే ఎన్నో సార్లు చూసిన చిత్రంగా అనిపిస్తుంటుంది. తమిళ శరణార్థుల కోసం లండన్‌లో పోరాడే ఓ గ్యాంగ్ స్టర్ కథగా జగమే తంత్రాన్ని మలిచారు. ఇందులో కథ పర్వాలేదనిపించినా కూడా కథనం అంతగా రక్తికట్టలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిజం చుట్టూనే కథను అల్లాడనే కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఓటీటీలో వస్తున్న మూవీలన్నీ కూడా నిరాశ పరుచుతుండటంతో సినీ ప్రేమికులు నిరాశపడుతున్నారు. జగమే తంత్రం ఎలా ఉన్నా కూడా అభిమానులను మాత్రం ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నట్టుంది. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం జగమే తంత్రం హవా కొనసాగుతోంది. మాస్ హీరోయిజాన్ని తన స్టైల్లో చూపించడంతో ధనుష్ మరోసారి నిరూపించుకున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి జగమే తంత్రం ఓ మోస్తరుగా పర్వాలేదనే టాక్‌ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్‌లో జగమే తంత్రం వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iPi0NG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...