Thursday, 17 June 2021

Hyper Aadi: రిసార్ట్‌లో హైపర్ ఆది, ప్రియమణి.. బావా అంటూ రెచ్చిపోయిన బ్యూటీ! ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదంటూ..

సాధారణంగా కామెడీ అంటే పీక్స్‌లో ఉంటుందనే సంగతి తెలిసిందే. మాట మాటకు పంచ్ వేస్తూ పొట్టచెక్కలయ్యే వినోదం పంచడంలో ఈ జబర్దస్త్ కమెడియన్‌కి సాటెవ్వరూ లేరని చెప్పుకోవచ్చు. ఇక మనోడిలో ఉండే రొమాంటిక్ ఫీలింగ్స్ గురించయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అమ్మాయిలతో ఆయన మాట్లాడే తీరు, డబుల్ మీనింగ్ డైలాగ్స్.. అబ్బో! అవన్నీ ఓపెన్‌గా వివరించడం కష్టమే లెండి. సందు దొరికితే దూసుకుపోయే హైపర్ ఆది.. ఈ సారి నేరుగా రామాంటిక్ టూర్ వేశాడు. అది కూడా సీనియర్ హీరోయిన్ ప్రియమణితో. మరి ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దామా.. ప్రియమణితో హైపర్ ఆది రొమాంటిక్ టూర్ వేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది నిజం కాకపోయినా ఆ రేంజ్ చూపిస్తూ అందరి చూపు తమపై పడేలా చేసుకున్నారు ఈ ఇద్దరూ. తాజాగా విడుదలైన 'ఢీ13' ప్రోమోలో ఈ సీన్ కనిపించింది. ప్రియమణిని హైపర్ ఆది ఓ రిసార్ట్‌కి తీసుకెళ్లినట్లు చూపించడంతో ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇక ఇందులో బావా మరదలుగా వాళ్లిద్దరూ రెచ్చిపోవడం బాగా హైలైట్ అయింది. జబర్దస్త్ వేదికపై నవ్విస్తూనే ‘ఢీ' డ్యాన్స్ షోలోనూ ఓ టీమ్‌కు మెంటర్‌గా ఉన్న హైపర్ ఆది.. అక్కడ కూడా అద్భుతమైన పంచులతో పరేషాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రోమోలో రొమాంటిక్ మూడ్‌లో పిచ్చెక్కించ్చాడు. ప్రియా.. అంటూ హైపర్ ఆది ముద్దుగా పిలుస్తుండగా, బావా.. అంటూ ప్రేమగా అతన్ని పిలుస్తూ కనిపించింది . ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదంటూ ఆది పేల్చిన మాటల తూటాలు హైలైట్ అయ్యాయి. నీకు ఏ టిఫిన్ కావాలని ఆది అడగగా.. ‘నీకు ఏది ఇష్టమో నాకు అది కావాలి' ప్రియమణి చెప్పడం, ఇక పక్క రూములోనే హీరోయిన్ పూర్ణతో మరో జబర్దస్త్ వీరుడు ఉండటం.. ఈ జోడీలు మధ్య షూట్ చేసిన సన్నివేశాలు, వాళ్ళ డబుల్ మీనింగ్ డోస్.. మాములుగా లేదండీ బాబు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోను మీరూ చూసేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vB8EYK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...