Friday, 18 June 2021

Farhan Akhtar : ఇంకా నమ్మశక్యంగా లేదు.. మిల్కా సింగ్ మరణంపై ఫర్హాన్ అక్తర్ ఎమోషనల్

భారత ప్రఖ్యాత అథ్లెట్ మరణించారు. ఇటీవల కోవిడ్‌ బారిన పడిన దాన్ని జయించారు. కానీ తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయారు. మే 20న కరోనా సోకిన తరువాత 91 ఏళ్ల మిల్కా సింగ్‌ను చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. శుక్రవారం రాత్రి 11.30కు మిల్కా సింగ్ మరణించినట్లు ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.ఈయన మరణం దేశ మొత్తం విషాదం నెలకొంది. సినీ రాజకీయ సాధారణ ప్రజలంతా కూడా మిల్కా సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈక్రమంలో ఈయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసి హిట్ కొట్టిన ఎమోషనల్ అయ్యారు. భాగ్ మిల్కా భాగ్ అంటూ ఫర్హాన్ అక్తర్ ఆ పాత్రలో జీవించేశారు. అలా నాటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఫర్హాన్ అక్తర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా వరకు మీరు లేరనే ఈ విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను.. లోలోపల ఏదో అవుతోంది.. నా మనసు ఇంకేదో చెబుతోంది.. మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. కానీ నిజం ఏంటంటే మీరెప్పుడూ కూడా ప్రాణాలతోనే ఉంటారు. మీరెంతో మంచివారు. గొప్పవారు. ఓ ఐడియా, కలలకు మీరొక ప్రతినిధి. మోకాళ్ల మీద నిల్చునే వ్యక్తికి వారి కష్టం,పట్టుదలతో ఆకాశాన్ని తాకొచ్చనే మాటలను మీరు నిరూపించారు. మీరు నాన్నగా, స్నేహితుడిగా మీతో ఉన్న వాళ్లందరూ ఎంతో అదృష్టవంతులు. మీరెంతో మందికి స్ఫూర్తి ప్రధాతలంటూ ఫర్హాన్ అక్తర్ ఎమోషనల్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wEPvq8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...