Sunday, 20 June 2021

ఫాదర్స్ డే స్పెషల్.. ఉపాసన మెచ్చిన వీడియో ఇదే

మెగా కోడలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇటు అపోలో వ్యవహారాలు చూసుకుంటూనే మరో వైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఇక రామ్ చరణ్ అభిమానులకు కావాల్సిన అప్డేట్లు కూడా ఇస్తుంటారు. సామాజిక సేవ, ఆరోగ్య చిట్కాలు, అవగాహన కల్పించే వీడియోలతో ఉపాసన ఇచ్చే సందేశాలు వైరల్ అవుతుంటాయి. ఇక నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఉపాసన షేర్ చేసిన పోస్ట్, వీడియోలు హల్చల్ అవుతున్నాయి. ఉపాసన, ఆమె తండ్రి అనిల్ కామినేని ఎక్కువగా ఫాం హౌస్‌లోనే ఉంటారు. అక్కడ అన్ని రకాల మూగజీవాలను వారు పెంచుతుంటారు. ఆమధ్య ఓసారి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న వీడియోలను, ఫోటోలను షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక నేడు కూడా ఉపాసన వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. తన తండ్రి గురించి చెబుతూ కొన్ని ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. ఈ ఫాంలో ఉంటే కొత్త ఆశలు చిగురిస్తుంటాయి.. నాకు ఇష్టమైన ఈ ప్రాణులన్నింటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న మా డాడికీ థ్యాంక్స్ అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. తాజాగా ఉపాసన మరో వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో తనకు ఎంతో ఇష్టమని కూడా పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె తండ్రి లేగదూడతో ఆడుకుంటున్నారు. ఆ లేగదూడ ఒక్కసారి ఉపాసన తండ్రి మీదకు ఎక్కే ప్రయత్నం చేసింది. అలా తండ్రి ఆడుకుంటున్న ఆ వీడియో అంటే తనకు ఇష్టమని ఉపాసన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cVHEfL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...