Wednesday, 16 June 2021

ఆ టైమ్‌లో చాలా సందేహ పడ్డాను.. చివరకు నా భర్త చెప్పడంతో చేసేశా: ప్రియమణి

సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం . ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత స్పీడు తగ్గించింది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తిరిగి రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చింది. ఓ వైపు బుల్లితెర షోస్‌తో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిటవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ ఫినిష్ చేసిన ఈ అమ్మడు.. ఇందులో నటించడానికి కారణం తన భర్తనే అని చెబుతూ ఓపెన్ అయింది. 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్‌లో భాగం కావడమే ప్రియమణిని తిరిగి బిజీ స్టార్ చేసింది. ఇంత గ్యాప్ తర్వాత ఆమె నటన చూసిన దర్శకనిర్మాతలు వరుస ఆఫర్స్ ఇచ్చేశారు. ఆ ఒక్క డిసీజన్ ప్రియమణి కెరీర్‌ని మరోసారి టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్‌ ఒప్పుకోవడానికి కారణం తన భర్త ముస్తాఫా రాజ్‌ అని చెబుతోంది ఈ సీనియర్ బ్యూటీ. భర్త ప్రోత్సాహం తోనే తిరిగి కెమెరా ముందుకొచ్చానని ఆమె పేర్కొంది. డైరెక్టర్లు రాజ్‌ అండ్‌ డీకె ఓ రోజు 'ఫ్యామిలీ మెన్' కథతో తనను కలిసి స్టోరీ వినిపించారని, ఈ మూవీలో తన క్యారెక్టర్‌ ఎలా ఉంటుందనేది విన్నాక కూడా తనలో నటించాలా.. వద్దా? అనే సందేహం ఉందని తెలిపింది. ఆ సమయంలో తన భర్త ముస్తాఫా రాజ్‌ ప్రొసీడ్ కావాలని చెప్పారని, దాంతో తాను ఫిక్సయి అందులో భాగమయ్యానని చెప్పింది. ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. ప్రస్తుతం తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాలో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు దగ్గుబాటి రానా హీరోగా రాబోతున్న 'విరాట పర్వం' సినిమాలో ఆమె భాగమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHvAzN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...