Wednesday, 9 June 2021

నటి, ఎంపీ నుస్రత్ ప్రెగ్నెన్సీ.! తనకి సంబంధం లేదన్న భర్త.! ప్రియుడి పనే అంటూ!

నుస్రత్ జహాన్.. పార్లమెంట్‌లో అందమైన ఎంపీ అని పేరు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ కావడంతో అదే గ్లామర్‌ని పాలిటిక్స్‌లోనూ కంటిన్యూ చేస్తూ తన మార్క్ చూపిస్తోంది. అందం, అభినయం, రాజకీయం ఇవే కాదు.. ఈ అందమైన ఎంపీని వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఆ మధ్య ఈమె ఫొటోలు ఏకంగా డేటింగ్ యాప్‌లో వచ్చాయి. ఇష్యూ పోలీసు కేసుల వరకూ వెళ్లింది. ‘ఆన్‌లైన్ డేటింగ్, వీడియో ఛాటింగ్ యాప్‌లో తన ఫొటోలు వీడియోలు రావడంతో షాకైన కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి ప్రెగ్నెంట్ రూమర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది నుస్రత్ జహాన్. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన నుస్రత్ జహాన్ ఆ తర్వాత బెంగాలీ సినిమాల్లో నటిగా రాణించారు. మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బసీర్‌హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయడం.. ఈ రిసెప్షన్‌కి మమతా బెనర్జీ రావడం కూడా జరిగాయి. అయితే నుస్రత్, నిఖిల్‌ జైన్‌‌ల మధ్య ఇగో ఇష్యూ తలెత్తడంతో పాటు తన పర్మిషన్ లేకుండా వ్యక్తిగత ఖాతాలోని డబ్బుల్ని వాడుకున్నాడంటూ జైన్‌పై ఆరోపణలు చేసింది నుస్రమ్. అయితే వీరి మధ్య గొడవలు ఎక్కువ కావడంతో గత కొన్నాళ్లుగా వేరు వేరుగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇంతలో జైన్‌ చెవిన షాకింగ్ న్యూస్ పడింది. తన భార్య నుస్రత్ జహాన్ నెలతప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఖంగుతిన్నాడట. అయితే నుస్రత్‌తో కాపురం చేయకుండా నెల తప్పడం ఏంటని.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదని నిఖిల్ ఆంగ్ల మీడియాకి వివరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ మాజీ నటి నెల ఎలా తప్పిందయ్యా అంటే.. బెంగాలీ నటిగా అనేక సినిమాల్లో నటించిన నుస్రత్ జహాన్ తన తోటి నటుడు, బీజేపీ నాయకుడు యష్ దాస్ గుప్తాతో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి గతంలో ‘ఎస్ఓఎస్ 2020’ అనే బెంగాలీ చిత్రంలో నటించారట. అప్పటి నుంచీ వీరి జోడీ ఆఫ్ స్క్రీన్‌లో కంటిన్యూ అవుతోందని దాని ఎఫెక్టే నుస్రత్ జహాన్ నెల తప్పడానికి కారణం అని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g95tmE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...