Sunday, 20 June 2021

పెళ్లి పీటలెక్కబోతున్న వర్ష! బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ సడెన్ షాకిచ్చిన జబర్దస్త్ బ్యూటీ

అటు వెండితెర, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ వేళ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా తమ తమ బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి వైవాహిక జీవితం లోకి అడుగు పెడుతుండటం చూశాం. ఇప్పుడు ఇదే బాటలో జబర్దస్త్ కూడా వెళ్లబోతోందా? అంటే అవుననే చెప్పుకోవచ్చు. తాజాగా ఆమె తన ఇన్స్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం. పలు సీరియళ్ళలో నటించాక జబర్దస్త్ వేదికపై అడుగుపెట్టింది వర్ష. హైపర్ ఆది టీమ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తన అందచందాలతో యమ అట్రాక్ట్ చేసింది. దీంతో అప్పటిదాకా రాని గుర్తింపు ఒక్కసారిగా వచ్చేసి ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత ఇమ్మానుయేల్‌తో జోడీ కుదరడంతో ఈ ఇద్దరి స్కిట్స్, రొమాంటిక్ మూమెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో వర్ష- ఇమ్మానుయేల్‌ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వాదన ముదరడం, షో నిర్వాహకులు సైతం దానిపైనే ఫోకస్ పెట్టడం లాంటివి షురూ అయ్యాయి. ఇంతలో తాజాగా తాళిబొట్టు చూపిస్తూ సడెన్ షాకిచ్చింది ఈ జబర్దస్త్ బ్యూటీ. జూలై 4వ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా అంటూ తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపించింది వర్ష. అంతటితో ఆగక మంగళసూత్రాన్ని చూపిస్తూ వరుడు, వధువు ఉన్న పిక్ షేర్ చేసి ఆశ్చర్యపర్చింది. దీంతో వర్ష పెళ్లిపై చర్చలు మొదలయ్యాయి. ఆమె చెప్పబోయేది పెళ్లి మ్యాటరే అని, త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కబోతోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ వర్ష పెళ్లాడేది ఎవరిని? మరి ఇమ్మాన్యుయేల్‌ ఏమైపోవాలి అంటూ ఆలోచనల్లో పడిపోయారు బుల్లితెర ఆడియన్స్. సో.. చూడాలి మరి వర్ష ఏం చెబుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UaUccI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...