Tuesday, 15 June 2021

సినిమా రౌండప్: హీరో నాని రెడీ.. లైన్‌లో వెంకటేష్.. రష్మిక మెసేజ్‌లో అంత అర్థముందా..?

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 16) సినిమా రౌండప్‌లో నాని 'టక్ జగదీష్' సినిమా సంగతులతో పాటు వెంకటేష్ లేటెస్ట్ మూవీ 'నారప్ప' విశేషాలు, ప్రవీణ్ సత్తారు సినిమా కోసం నాగార్జున ప్రయత్నాలు, సమంత ‘శాకుంతలం’ ప్లాన్స్, అలాగే రష్మిక సోషల్ మీడియా మెసేజ్ తదితర విషయాలను చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను, సినిమా సంగతులను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం.

సినిమా రౌండప్: హీరో నాని రెడీ.. లైన్‌లో వెంకటేష్.. రష్మిక మెసేజ్‌లో అంత అర్థముందా..?

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 16) సినిమా రౌండప్‌లో నాని 'టక్ జగదీష్' సినిమా సంగతులతో పాటు వెంకటేష్ లేటెస్ట్ మూవీ 'నారప్ప' విశేషాలు, ప్రవీణ్ సత్తారు సినిమా కోసం నాగార్జున ప్రయత్నాలు, సమంత ‘శాకుంతలం’ ప్లాన్స్, అలాగే రష్మిక సోషల్ మీడియా మెసేజ్ తదితర విషయాలను చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.

'టక్ జగదీష్' రెడీ
'టక్ జగదీష్' రెడీ

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన 'టక్ జగదీష్' సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. కరోనా కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. అదే రోజు ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదల కావాల్సి ఉండగా అది వాయిదా వేయనున్నట్లు తెలియడంతో 'టక్ జగదీష్'ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట.

నాగార్జున ట్రైనింగ్
నాగార్జున ట్రైనింగ్

విలక్షణ పాత్రలతో సీనియర్ హీరో నాగార్జున దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో ప్రయోగాత్మక సినిమా చేసేందుకు రెడీ అయిన ఆయన.. ఈ మూవీలోని క్యారెక్టర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపించనున్న నాగార్జునపై హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం నాగార్జున ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని టాక్.

లైన్‌లో వెంకటేష్
లైన్‌లో వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'నారప్ప'. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్‌’కి రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ అతిత్వరలో ప్రకటిస్తామని అంటోంది చిత్రయూనిట్. ఇందులో వెంకటేష్‌ రెండు విభిన్నమైన అవతారాలలో కనిపించనుండటం విశేషం.

రష్మిక మందన మెసేజ్‌
రష్మిక మందన మెసేజ్‌

'పెద్ద పనులు చేయాలనుకుంటున్న అమ్మాయి.. చిన్న చిన్న పనులను తన చెంతకు రానివ్వదు.. అని ఎవరో చెప్పారు. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది' అంటూ రష్మిక చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ట్వీట్ చూసి పలు అర్థాలు వెతుకుంటున్నారు నెటిజన్లు. ఇది చూస్తుంటే.. బాలీవుడ్‌‌లో అవకాశాలు వస్తున్నాయి, ఇక సౌత్‌తో పనేముంది అనే హింట్‌ ఇచ్చిందా? అని చర్చించుకుంటున్నారు.

సమంత ‘శాకుంతలం’ ప్లాన్స్
సమంత ‘శాకుంతలం’ ప్లాన్స్

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. ఆమె కెరీర్‌లో ఇదే తొలి పౌరాణిక మూవీ. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చిన చిత్రయూనిట్.. తిరిగి ఈ నెలాఖరున సెట్స్ పైకి రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో సమంత, దేవ్‌మోహన్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని సమాచారం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zux4pR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...